నా ఆల్ టైమ్ ఫేవరెట్ అదే – సూపర్ స్టార్ మహేష్ బాబు

Published on Mar 31, 2020 11:24 am IST

తెనాలి పక్కన బుర్రిపాలెం అనే చిన్న పల్లెటూరులో పుట్టిన శివరామకృష్ణ అనే వ్యక్తిని సూపర్ స్టార్ కృష్ణగా మార్చింది ‘తేనే మనసులు’ అనే సినిమా. తెలుగులో ఇదే తొలి సాంఘిక రంగుల చిత్రం కావడం గమనార్హం. కాగా సూపర్ స్టార్ కృష్ణను వెండితెరకు పరిచయం ఆయన తొలి చిత్రం ‘తేనెమనసులు’ విడుదల అయి నేటికీ సరిగ్గా 55 ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మహేష్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘నా ఆల్ టైమ్ ఫేవరెట్.. టైం లెస్ క్లాసిక్ అయిన ‘తేనే మనసులు’ సినిమానే. ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణ గారు ప్రయాణం మొదలై ఈ రోజుతోటి 55 సంవత్సరాల పూర్తయింది. ఆయన ప్రారంభం బ్లాక్ బస్టర్ తోనే మొదలైంది. మన సూపర్‌స్టార్ యొక్క లెజెండరీ జర్నీ తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకుందాం’ అని మహేష్ పోస్ట్ చేసారు.

కాగా ఈ సినిమా గురించి కృష్ణగారు గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు కొద్దిగా నాటకానుభవం ఉన్నా.. డాన్స్‌ చేసేటప్పుడూ, పాటలకు లిప్‌ మూమెంట్‌ ఇచ్చేటప్పుడూ చాలా కష్టపడ్డాను. దర్శకుడు ఆదుర్తి, నృత్య దర్శకుడు హీరాలాల్‌, కో-డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌ గారు కూడా నాకు నటనలో కొన్ని మెలకువలు నేర్పారు. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత నా నటన చూసుకుని చాలా తేలికపడ్డాను అని కృష్ణ తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More