మహేష్ అభిమానులకు నా క్షమాపణలు – మనోజ్ ప్రభాకర్ !

Published on Sep 16, 2018 2:44 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫై వివాదాస్పద వాఖ్యలు చేసిన కోలీవడ్ కమీడియన్ మనోజ్ ప్రభాకర్ మహేష్ కు అలాగే అయన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మహేష్ సినిమాలపై ఆయన నటన ఫై తప్పుడు వాఖ్యలు చేశారు. ‘స్పైడర్’ చిత్రంలో నటించిన మహేష్ ముఖంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ లేవు. విలన్ పాత్రలో నటించిన ఎస్ జె సూర్య అద్భుతంగా నటించారు. మహేష్ కంటే ఈ సినిమాలో రాళ్లు బాగా నటిచాయనిపించిందని అని అన్నారు.

ఈకామెంట్లను మహేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా మనోజ్ ప్రభాకర్ ఫై ప్రతి దాడికి దిగారు. దాంతో అభిమానుల దెబ్బకు మనోజ్ ఫెస్ బుక్ ద్వారా క్షమాపణలు చెప్పారు. హలో పీపుల్ సోషల్ మీడియాలో నాపై చాలా కామెంట్లు వస్తున్నాయి. నేను మహేష్ గురించి మాట్లాడిన విషయాలను యూ ట్యూబ్ లో చాలా రోజల క్రితం అప్ లోడ్ అయ్యాయి. మాక్ అవార్డు షో లో భాగంగా రూపొందించిన వీడియో అది. వీడియో కి ముందు డిస్ క్లెయిమర్ కూడా వేశాం. స్పైడర్ తమిళ వెర్షన్ చూశాను. నేను చేసిన కామెంట్స్ తమిళ వెర్షన్ కు సంబంధించినవే. సినిమాలో హీరో సరిగ్గా నటించలేకపోయారు అని అన్నాను. అంటే దాని అర్ధం ఆయన చెత్త నటుడని కాదు. ఒక సగటు ప్రేక్షకుడిగా నా అభిప్రాయాన్ని వెల్లడించాను. అంతే నేను ఎవరిని కించపరచడానికి ఈ వీడియో చేయలేదు.

అనవసరంగా నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ ను టార్గెట్ చేస్తున్నారు. నాతో మాట్లాడండి వాళ్లను ఇందులోకి లాగొద్దు నాకు వచ్చిన కామెంట్స్ లోచాలా మంది నువ్వు అసహ్యం గా వున్నావని అంటున్నారు. ఆవిషయం నాకు తెలుసు అనవసరంగా మీ సమయం వృధా చేసుకోకండి. నా మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే నన్ను క్షమించండి. మహేష్ కు కూడా నా క్షమాపణలు తెలియజేస్తున్న అని వెల్లడించారు మనోజ్ ప్రభాకర్.

సంబంధిత సమాచారం :