డైలాగ్ కింగ్ సాయి కుమార్ చిత్ర పరిశ్రమ లో 40 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు. ఆయన తన సినీ ప్రస్థానం పట్ల ఎంతో సంతోషంగా వున్నారు. తన పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గానే కాకుండా క్యారెక్టర్ యాక్టర్ గా కూడా నటించారు.
అయితే సాయి కుమార్ కి ఒక కల వుంది. “నాకు దుర్యోధుని పాత్ర పోషించాలనుంది. నేను బాలకృష్ణ ‘నర్తనశాల’ చిత్రంలో దుర్యోధుని పాత్ర పోషించాల్సివుంది అయితే ఆ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళలేదు. నేను తప్పకుండా ఆ పాత్రని పోషిస్తాను. అని ఆయన తెలిపారు.
సాయి కుమార్ తన కొడుకు కెరీర్ మలచుకుంటున్న విధానం పై ఆనందంగా వున్నారు.


