నా యూనిట్ ఇబ్బందులలో ఉంది.. హెల్ప్ చేయండి – గౌతమ్ మీనన్

దక్షిణాది స్టార్ డైరెక్టరల్లో ఒకరైన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ధృవ నట్చత్తిరం’ ను తెరకెక్కించే పనిలో ఉన్న సంగతి తెల్సిందే. ప్రధానంగా యూరప్ దేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. అంతా సజావుగానే సాగుతుందనుకునే సమయానికి చిత్ర యూనిట్ తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. షూటింగ్ కోసం టర్కీ వెళ్లేందుకు చిత్ర యూనిట్ జార్జియా నుండి ఇస్తాంబుల్ కు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించారు. కానీ టర్కీ బార్డర్ వద్ద భద్రతా సిబ్బంది వాళ్ళను నిలిపివేశారు.

సుమారు 24 గంటల నుండి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ విషయంపై గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ‘అక్కడి అధికారులు మా టీమ్ ను పరికరాలతో లోపలి అనుమతించడంలేదు. సుమారు 24 గంటల నుండి నా యూనిట్ అక్కడే ఇరుక్కుపోయారు. అధికారుల నిబంధనలను అందుకోలేకున్నాం. టర్కీ మీ దేశంలో అందమైన లొకేషన్లలో సినిమా తీయాలని అనుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎవరైనా చదువుతుంటే సహాయం చేయండి. మా క్రూ గురించి టెంక్షన్ గా ఉంది’ అన్నారు. ఈ ఇబ్బంది నుండి గౌతమ్ మీనన్ టీమ్ త్వరగా బయటపడి షూట్ మొదలుపెట్టాలని కోరుకుందాం.