అమ్మ చున్నీనైనా వాడండి, సురక్షితంగా ఉండండి – విజయ్ దేవరకొండ

Published on Apr 7, 2020 2:54 pm IST

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు తెలియజేస్తూ వస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కరోనా మహమ్మారి గురించి పోస్ట్ చేస్తూ.. ‘నా ప్రేమైన మీరందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వైరస్ నుండి కాపాడుకోవడానికి క్లాత్ తో పేస్ కవర్ చేసుకున్నా చాలు .. వైరస్ తొందరగా వ్యాప్తి చెందదు. అందుకే వైద్యుల కోసం మెడికల్ మాస్క్‌లను వదిలివేయండి. బదులుగా రుమాలు వాడండి. లేదా కండువా ఉపయోగించండి. లేకపోతె అమ్మ చున్నీనైనా వాడండి. ఏదొక దానితో మీ ముఖాన్ని కప్పుకోండి, సురక్షితంగా ఉండండి’ తన ఫోటో తో పోస్ట్ చేశాడు.

కాగా క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నా.. కేసులు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాలి. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాలి, అంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాలి.

సంబంధిత సమాచారం :

X
More