నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్‌లోనే ఎన్నడూ చూడని విధంగా, అత్యంత విభిన్నమైన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా ‘మైసా’. డెబ్యూ డైరెక్టర్ రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ తాజాగా లాక్ చేశారు. త్వరలోనే ఈ టీజర్‌ను అధికారికంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ టీజర్‌ను చూసిన ఇండస్ట్రీ వర్గాలు దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇందులో రష్మిక లుక్, ఆమె పర్ఫార్మెన్స్ ‘రష్మిక 2.0’ వెర్షన్‌ను పరిచయం చేసేలా ఉందని టాక్. దట్టమైన అడవుల నేపథ్యంలో ఒక క్రూరమైన గిరిజన యువతిగా రష్మిక మునుపెన్నడూ లేని విధంగా ఒక రా అండ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనుంది. కేవలం మేకప్, లుక్స్ పరంగానే కాకుండా, ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరి హై-రిస్క్ యాక్షన్ సీక్వెన్స్‌లలో డూప్ లేకుండా నటించడం విశేషం.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై టెక్నికల్‌గా ఎంతో ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. త్వరలో రాబోయే టీజర్ ఈ మొరటు, క్రూరమైన ప్రపంచాన్ని మరింత లోతుగా చూపించడమే కాకుండా.. రష్మిక మందన్న కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతోంది.


