‘చెన్నై లవ్ స్టోరీ’ నైజాం రిలీజ్.. మైత్రీ ఖాతాలో మరో హిట్ ఖాయం..?

‘చెన్నై లవ్ స్టోరీ’ నైజాం రిలీజ్.. మైత్రీ ఖాతాలో మరో హిట్ ఖాయం..?

Published on Jul 13, 2026 9:04 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ క్రేజీ లవ్ స్టోరీ ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేట్రికల్ బిజినెస్ పరంగా టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్ర నైజాం రైట్స్‌ను టాలీవుడ్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కైవసం చేసుకుంది.

మైత్రీ సంస్థ ఈ సినిమాను నైజాంలో అడ్వాన్స్ బేసిస్ పై భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమైంది. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీగౌరి ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

తాజా వార్తలు