సూపర్ కాంబో సెట్ చేసుకున్న మైత్రి మూవీమేకర్స్!
Published on Apr 22, 2018 2:13 pm IST

రంగస్థలం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ ఏ స్టార్ హీరోతో వర్క్ చేస్తాడా అని గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు మహేష్ తో సెట్ అయ్యిందని టాక్ గట్టిగానే వచ్చింది. అయితే ఫైనల్ గా సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫిక్స్ అయ్యిందని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా తెలిపింది. ఇంతకుముందు మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా చేసిన సంగతి తెలిసిందే.

అలాగే సుకుమార్ తో రంగస్థలం సినిమా చేసి ఆ సంస్థ నిర్మాతలు మంచి లాభాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ ఈ దర్శకుడిని ఆ హీరోని ఒకటి చేస్తూ ఒక భారీ బడ్జెట్ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. 2019లో ఆ సినిమా పట్టాలెక్కనుంది. మహేష్ ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook