స్టార్ హీరోతో మైత్రి మూవీ మేకర్స్ నెక్స్ట్ మూవీ?

Published on Jun 28, 2022 2:00 am IST

మలయాళ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో పృథ్వీరాజ్ ఒకరు. తాజాగా విడుదలైన కడువ సినిమా ప్రమోషన్ల కోసం ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం పృథ్వీరాజ్ త్వరలో ఓ తెలుగు సినిమా చేయనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ స్టార్ హీరోతో ఒక చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. రానున్న రోజుల్లో పృథ్వీరాజ్ తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :