కొత్త పోస్టర్ విడుదల చెయ్యనున్న నాపేరు సూర్య టీం !
Published on Feb 26, 2018 7:12 pm IST

వక్కంతం వంశి దర్శకత్వంలో బన్ని నటిస్తోన్న సినిమా నా పేరు సూర్య. అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ మే 4 న విడుదల కాబోతోంది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ సంస్థలో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

రైటర్ గా పలు సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశి ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ఇటీవల ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేసారు. తాజాగా మర్చి 1న కొత్త పోస్టర్ విడుదల చెయ్యబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రావ్ రమేష్, తమిళ్ హీరో అర్జున్, బోమైన్ ఇరాని ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.

 
Like us on Facebook