‘నా పేరు సూర్య’ మలయాళ టీజర్ ఎప్పుడంటే !

4th, February 2018 - 12:44:26 PM

అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్, సైనిక పాట రెండూ ఘన విజయాన్ని అందుకోవడంతో ప్రేక్షకుల్లో సినిమాపై గట్టి నమ్మకం ఏర్పడింది. దర్శకుడు వక్కంతం వంశీ కూడా ఆ అంచనాలని అందుకునేలా సినిమాని రూపొందిస్తున్నారు. ఇక బన్నీకి మలయాళంలో భారీ క్రేజ్ ఉండటంతో అక్కడ కూడా సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

అలాగే సినిమా యొక్క మలయాళ వెర్షన్ టీజర్ ను ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు దర్శక నిర్మాతలు. అంతేగాక ఫిబ్రవరి 14న ఆడియోలోని ఒక రొమాంటిక్ పాటను కూడా విడుదలచేయనున్నారు. బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా విశాల్, శేఖర్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు.