ఇంటర్వ్యూ : నాభ నటేష్ – నా ఫేవరేట్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ !

Published on Sep 17, 2018 6:08 pm IST

నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థ ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ పై హీరోగా నటిస్తూ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాబా నటేష్ కథానాయికగా నటించింది. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

ఈ సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చింది ?

మా దర్శకుడు ఆర్ ఎస్ నాయుడుగారు నా పెర్ఫార్మెన్స్ చూసి.. ఆయన రాసుకున్న కథలో హీరోయిన్ రోల్ కి నేనైతే బాగుంటుందని ఆయన ఫీల్ అయి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. అయితే రవిబాబు సర్ అదుగో సినిమాలో నేను భాగమైనప్పటికీ.. ‘నన్ను దోచుకుందువటే’ సినిమానే నా తొలి తెలుగు చిత్రంగా విడుదల అవ్వబోతుంది.

ప్రస్తుతం హీరోయిన్ గా బిజీ అవుతున్నారు. అసలు హీరోయిన్ కాకముందు ఏమి చేసేవారు, మీ గురించి చెప్పండి ?

మా స్వస్థలం బెంగళూరు. నా కాలేజీ రోజులు దగ్గర నుండే, నేను మోడలింగ్ చేసేదాన్ని, థియేటర్స్ ట్రైనింగ్ తీసుకున్నేదాన్ని. నేను భారతదేశమంతటా వివిధ రంగాలలో చాలా స్టేజి షోస్ ఇచ్చాను. ఒక రంగస్థల కళాకారుణిగా భిన్న పాత్రలను ఆత్మవిశ్వాసంతో చేయటానికి థియేటర్స్ ట్రైనింగ్ నాకు చాలా ఉపయోగపడింది.

ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ చాలా పోకస్డ్ గా ఉన్నట్లు ఉంది. మరి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?

ఈ సినిమాలో నేను చాలా సంతోషకరమైన మరియు సరదాగా ఉన్న అమ్మాయిలా కనిపించబోతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నా పాత్రలో వివిధ షేడ్స్ ఉన్నాయి. ఇక హీరో క్యారెక్టర్ చాలా పోకస్డ్ గా ఉంటుంది. తన గోల్స్ తప్ప, వేరే ఎవర్నీ పట్టించుకోడు. అంటే ఒక ప్రాక్టికల్ పర్సన్. అలాంటి వ్యక్తి లైఫ్ లోకి నేను ఎలా ఎంటర్ అయ్యాను. తన్ని ఎలా మార్చాను. అలా సాగుతుంది నా క్యారెక్టర్. మంచి భావోద్వేగ అమ్మాయిగా ఈ సినిమాలో నటించాను. నా తొలి చిత్రంలోనే ఇంతటి బలమైన పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ చిత్ర హీరో మరియు నిర్మాత అయిన సుధీర్ బాబుగారితో పని చేయడం మీకు ఎలా అనిపించింది ?

ఆయనతో పనిచేయటం చాలా సౌకర్యవంతగా ఉంటుంది. కేవలం ఆయన ప్రోత్సాహం కారణంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రతిదీ సజావుగా సాగింది. చిత్ర నిర్మాత అయినప్పటికీ ఆయన ఎప్పుడు సెట్ లో విసుగుకున్నట్లు కూడా నేను చూడలేదు.

‘అదుగో’లో మీ పాత్ర గురించి చెప్పండి ?

‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో నేను పోషిస్తున్న పాత్రతో పోలిస్తే.. అదుగో చిత్రంలోని పాత్ర చాలా భిన్నమైనది. ఆ సినిమా మొత్తం నా పాయింటాఫ్ వ్యూలోనే నడుస్తుంది.

‘నన్ను దోచుకుందువటే’ సినిమా విడుదలకై మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు ఉన్నారు ?

అవును. నా మొదటి తెలుగు సినిమా కదా. మా సినిమా పట్ల. సినిమాలో నా పాత్ర పట్ల తెలుగు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలని ఆత్రుతగా ఆసక్తిగా ఉంది.

మీ మాటలను బట్టి మీరు తెలుగు సినిమాలు బాగా చూస్తారనుకుంటా. తెలుగులో మీ అభిమాన హీరో ఎవరు ?

హీరోయిన్ కాకముందు నుంచే నేను తెలుగు సినిమాలు చూస్తున్నాను. ఇక తెలుగులో నా ఫేవరేట్ హీరో అంటే.. ముందుగా చెప్పాల్సిన పేర్లు అల్లు అర్జున్, మహేష్ బాబు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నాకు ఫేవరేట్ హీరోనే.

అదుగో కాకుండా.. మీ తదుపరి ప్రాజెక్టులు ఏమిటి  ?

ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే అదుగో కూడా విడుదలకు సిద్ధంగానే  ఉంది. ఇవి కాకుండా అంటే,  స్క్రిప్ట్స్ వింటున్నాను. ఖరారు చేసిన తర్వాత ఎలాగూ  మీకు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :