ప్రభాస్ రాజట…దీపికా రాణి అట..!

Published on Jul 19, 2020 12:58 pm IST

ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె అనగానే మూవీ భారీ స్కేల్ లో తెరకెక్కనున్నట్లు అర్థం అయ్యింది. టాలీవుడ్ కి దీపికను ప్రభాస్ మొదటిసారి తీసుకువస్తున్నారు. దీనిపై ప్రభాస్ 21 దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికరంగా స్పందించారు. రాజు స్థాయికి సరిపోయే రాణిని తేవాలి కదా, చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. పిచ్చెక్కిద్దాం అని ఆయన ఫ్యాన్స్ కి తెలియజేశారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న దీపిక మూవీలో నటించడం ఈ మూవీకి మంచి ప్రచారం దక్కడం ఖాయం.

ప్రభాస్ 21 మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక 2022 సమ్మర్ కి ఈ మూవీ విడుదల చేయాలనేది…నిర్మాత ఆలోచన. దాదాపు 500కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కథపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రభాస్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.

సంబంధిత సమాచారం :