‘ప్రభాస్ – నాగ్ అశ్విన్’ సినిమా పోస్ట్ ఫోన్ అయిందా ?

Published on Mar 24, 2020 11:00 pm IST

నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. కాగా మొదట ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది ఆఖర్లో మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ ను వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుండి షూట్ ప్లాన్ చేస్తున్నారు. యూరప్‌ లో ప్రభాస్, జాన్ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా రద్దయింది. దాంతో జాన్ సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ అయింది. దాని కారణంగానే నాగ్ అశ్విన్ – ప్రభాస్ సినిమా కూడా పోస్ట్ ఫోన్ అయిందట.

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More