నాగ్ 60 రోజుల వరకు కనిపించడట !

Published on Jan 24, 2019 4:44 pm IST


గత ఏడాది ‘దేవదాస్’ అనే మల్టీ స్టారర్ చిత్రం తో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున ఈ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకొని తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘ మన్మథుడు 2 ‘ చిత్రంలో నటించనునున్నాడు.

ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ అధికభాగం యూరప్ లో జరుగనుంది. దాంతో నాగ్ రెండు నెలలు అక్కడే ఉండనున్నారని సమాచారం. ఫిబ్రవరి మూడవ వారంలో ఈ చిత్రాన్ని లాంచ్ చేసి మార్చి రెండవ వారంలో షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం హీరోయిన్ ను వెతికే పనిలో దర్శకుడు.

అయితే ఈ చిత్రానికి ముందు నాగ్ ,ధనుష్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రంలో నటించాల్సి వుంది. అనివార్య కారణాలవల్ల ఈ చిత్రాన్ని పక్కకు పెట్టేశాడు ధనుష్.

సంబంధిత సమాచారం :