ఫన్నీ ఫన్నీగా ఉండనున్న నాగ్, నాని మల్టీ స్టారర్ !
Published on Jun 21, 2018 11:05 am IST

సీనియర్ హీరో నాగార్జున, యువ హీరో నానిలు కలిసి ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య డైరెక్టక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ కొంత వరకు పూర్తైంది. ఇందులో నాగార్జున గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనుండగా నాని డాక్టర్ పాత్రలో, అదీ నాగార్జునకు పర్సనల్ డాక్టర్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమా పూర్తిగా ఫన్ తో నిండి ఉంటుందని, నాగార్జున, నానిల నడుమ సాగే హాస్యం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో మంచి ఫీల్ కలిగిన ఎమోషన్ కూడ ఉంటుందని అంటున్నారు. సి. అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న నానికి జోడీగా నటించనుండగా ఆకాంక్ష సింగ్ నాగార్జున సరసన మెరవనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook