వైరల్ అవుతోన్న నాగ్, రకుల్ వర్కౌట్స్ వీడియో !

Published on Apr 26, 2019 8:00 pm IST

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వస్తోన్న చిత్రం ‘మన్మథుడు 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చు‌గ‌ల్‌ లో శరవేగంగా జరుగుతుంది. అయితే నాగార్జునకు, రకుల్ ప్రీత్ సింగ్ కు ఫిట్నెస్ అంటే ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుంటారు. అందుకే షూటింగ్ జరుగుతున్న లొకేషన్ దగ్గర్లో ఓ జిమ్ లో జాయిన్ అయి మరి వర్కవుట్స్ చేస్తున్నారు ఈ హీరోయిన్లిద్దరూ.

కాగా ఈ వర్కవుట్స్‌కి సంబందించిన వీడియోను నాగ్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్ అండ్ షేర్ చేస్తున్నారు. ఇక నాగ్ బెస్ట్ మూవీస్ లో మన్మథుడు ముందువరుసలో ఉంటుంది. మరి అలాంటి మూవీకి సీక్వెల్ గా వస్తోన్న ఈ మన్మథుడు 2 ఎలా మెప్పిస్తాడో చూడాలి.

ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్.

సంబంధిత సమాచారం :