వైరల్ అవుతోన్న మెగా బ్రదర్ వీడియో !

Published on Feb 6, 2019 3:58 pm IST


గత కొన్ని వారాల నుంచి, నాగబాబు ఎన్నడూ లేని విధంగా యూట్యూబ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద తనదైన శైలిలో వ్యగ్యంగా వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన తాజాగా విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చర్చ అవుతుంది.

ఓ ఛానల్ వాళ్ళు లేనిపోనివి కల్పించి ఓ రాజకీయ పార్టీకి భజన చేస్తోందని నాగబాబు ఆ వీడియోలో సున్నితంగా విమర్శించారు. అలాగే హీరోయిన్స్ మరియు ఆడవారి దుస్తుల పై ఓ సినీ ప్రముఖుడు చేసిన కామెంట్స్ పై కూడా నాగబాబు తన శైలిలో విమర్శిస్తూ.. ఓ వీడియో చేశారు. అది కూడా సోషల్ మీడియా బాగానే హల్ చల్ చేసింది.

మొత్తానికి ఏపీలో రాబోతున్న ఎలెక్షన్స్ ను దృష్టిలో పెట్టుకునే నాగబాబు కొన్ని రోజులుగా రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్నారని అర్ధమవుతుంది. మరి ముందు ముందు ఆయన ఇక ఎలాంటి వీడియోలు చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :