ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన కెరీర్ 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న ఈ చేస్తున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేస్తుండగా మేకర్స్ లేటెస్ట్ గా మరో సాలిడ్ ఎడిషన్ ని అనౌన్స్ చేశారు.
ఈ చిత్రంలోకి ప్రముఖ వెర్సటైల్ నటుడు, ఇటీవల భారీ చిత్రం నాగ బంధం లో సాలిడ్ రోల్ లో కనిపించిన నటుడు మురళీ శర్మ యాడ్ అయినట్టు అనౌన్స్ చేశారు. తన పుట్టినరోజు కూడా కావడంతో ఈ అప్డేట్ ని అందించారు. ఇక తన లుక్ కూడా ఇందులో బాగుంది. సో తన రోల్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా అనశ్వర రంజన్ మెగాస్టార్ కూతురి పాత్రలో నటిస్తుంది. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో టాలీవుడ్ లో తమ తొలి సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.


