టాలీవుడ్ లో గత కొంత కాలంగా చర్చగా నడుస్తూ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమానే ‘నాగ బంధం’. కేవలం ఒక్క సినిమా హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ విజువల్స్ అండ్ సెట్టింగ్స్ తో తీసారు. అయితే ఫైనల్ గా ఈ సినిమా తాలూకా ట్రైలర్ కట్ ని మేకర్స్ ఇపుడు విడుదల చేసారు.
ఈ ట్రైలర్ మాత్రం ఒక విజువల్ వండర్ తో కూడిన గ్రాండ్ అడ్వెంచరస్ ట్రీట్ ని ప్రామిస్ చేస్తుందని చెప్పవచ్చు. ఒక బ్రహ్మ కమలం చుట్టూతా అల్లుకున్న సాలిడ్ అడ్వెంచర్ డ్రామాలో ఫాంటసీ మరియు డివోషనల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం ఒకెత్తు అయితే వాటికి ఏమాత్రం తీసిపోకుండా ప్లాన్ చేసుకున్న నిర్మాణ విలువలు మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో ఆశ్చర్య కరంగా ఉన్నాయి.
మేకర్స్ పెట్టిన భారీ బడ్జెట్ అంతా సెట్టింగ్స్, విజువల్స్ తో ఎక్కడా కృత్రిమంగా కనిపించకుండా ప్రెజెంట్ చేయడంలో ట్రైలర్ వరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక విరాట్ కర్ణ తన రోల్ లో డైనమిక్ గా కనిపించాడు. అసాధ్యమైన బ్రహ్మ కమలం తీసుకొచ్చే కార్య సాధకుడిగా తను కనిపిస్తున్నాడు. ఇక తనతో పాటుగా గరుడ రవి కి కూడా ఇందులో సాలిడ్ రోల్ దక్కినట్టు తెలుస్తుంది.
తనతో పాటుగా ఇందులో మరింత మంది విలన్స్ కనిపిస్తున్నారు. ఇలా అన్ని అంశాల్లో నాగ బంధం ట్రైలర్ టాప్ నాచ్ లో ఉంది. సంగీతం, కెమెరా వర్క్ లు కూడా ట్రైలర్ లో ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి. మరి ఈ అవైటెడ్ సినిమా బిగ్ స్క్రీన్స్ పై ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలి అంటే ఈ జూలై 3 వరకు ఆగాల్సిందే.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


