నెల రోజులు ఆమిర్ ఖాన్‌తో నాగ చైతన్యు

Published on May 4, 2021 9:00 pm IST

బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ స్నేహితుడి పాత్ర కోసం మొదట తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ సేతుపతికి డేట్స్ క్లాష్ రావడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ పాత్రను నాగ చైతన్య చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘థాంక్యూ’ షూటింగ్లో ఉన్న చైతన్య త్వరలోనే తిరిగొచ్చి ఆమిర్ ఖాన్ సినిమాలో జాయిన్ కానున్నారు.

ఆమీర్ ఖాన్, చైతన్యలు కలిసి సుమారు నెల రోజుల పాటు వర్క్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో నాగ చైతన్య ఆమిర్ ఖాన్ స్నేహితుడి పాత్రలో నటించనున్నారు. కథ కాసేపు ఆర్మీ నేపథ్యంలో నడుస్తుంది. ఆర్మీలో హీరో పాత్రకు అత్యంత సన్నిహితమైన పాత్రనే చైతన్య చేయబోతున్నాడు. అందులో ఒక వార్ ఎపిసోడ్ కూడ ఉండనుంది. చెప్పాలంటే నటుడిగా చైతన్యకు ఇది చాలామంచి అవకాశం. ఇది అతని బాలీవుడ్ ఎంట్రీకి కూడ ఉపకరిస్తుంది. ఇకపోతే నాగ చైతన్య చేసిన ‘లవ్ స్టోరీ’ చిత్రం అన్ని పనులు ముగించుకుని విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :