నాగ చైతన్య ‘దూత’ వెబ్ సిరీస్ రిలీజ్ అప్ డేట్ … !

నాగ చైతన్య ‘దూత’ వెబ్ సిరీస్ రిలీజ్ అప్ డేట్ … !

Published on Jul 19, 2022 11:30 PM IST

అక్కినేని యువ హీరో నాగ చైతన్య లేటెస్ట్ గా చేస్తున్న మూవీ థాంక్యూ. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని విక్రమ్ కుమార్ తెరకెక్కించగా దిల్ రాజు ఎంతో భారీగా నిర్మించారు. మంచి హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన థాంక్యూ మూవీ ఈనెల 22న విడుదల కానున్న సందర్భంగా ప్రస్తుతం మూవీ కి సంబంధించి విరివిగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు నాగచైతన్య.

ఇక ఈ మూవీ గురించి పలు విషయాలు మీడియాతో షేర్ చేసుకున్న నాగ చైతన్య, ప్రస్తుతం మరోవైపు విక్రమ్ కుమార్ తో దూత అనే వెబ్ సిరీస్ గురించి కూడా పలు విషయాలు చెప్పారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సూపర్ నాచురల్ వెబ్ సిరీస్ లో తనకు హీరోయిన్ ఉండదని, ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ వెబ్ సిరీస్ ని దర్శకడు విక్రమ్ కుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అన్నారు. మరికొద్దిరోజుల్లో దూత షూట్ మొత్తం కంప్లీట్ కానుండగా వచ్చే ఏడాది జనవరి తరువాత ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు చైతన్య. కాగా దూత వెబ్ సిరీస్ ప్రముఖ ఒటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు