మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో చైతన్య ?

Published on Apr 24, 2019 2:00 am IST

నాగ చైతన్య – సమంత కలయికలో ఏప్రిల్ 5 న విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిత్రాల్లో ఎఫ్ 2 తరువాత అంత స్థాయిలో హిట్ అయి రెండో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది మజిలీ. ఇక చైతు ప్రస్తుతం ‘వెంకీ మామ’ షూట్ లో పాల్గొంటున్నాడు.

కాగా చైతు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చైతు ‘వెంకీమామ’ పూర్తి అవ్వగానే ఈ సినిమా మొదలు పెడతాడని.. మేర్లపాక గాంధీ చెప్పిన కథ చైతన్యకు బాగా నచ్చిందని తెలుస్తోంది.

మేర్లపాక గాంధీతో చెయ్యబోయే సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనరే అంటా. ఈ సినిమా ఎక్కువుగా పల్లెటూరి నేపథ్యంలోనే సాగుతుందట. అలాగే “ఆర్ఎక్స్ 100” దర్శకుడు అజ‌య్ భూప‌తితో కూడా నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం.

సంబంధిత సమాచారం :