ఫుల్ స్వింగ్ లో నాగచైతన్య ‘కస్టడీ’ ప్రమోషన్స్

Published on May 3, 2023 10:35 pm IST


అక్కినేని నాగచైతన్య తాజా ద్విభాషా సినిమా కస్టడీ. ఈ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద్ స్వామి నెగటివ్ రోల్ చేస్తున్న ఈ మూవీకి ఇళయరాజా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 5 న కస్టడీ ట్రైలర్ రిలీజ్ కానుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అక్కినేని ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక ప్రస్తుతం కస్టడీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తోంది యూనిట్. హీరో చైతన్య తో పాటు హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరూ కూడా ప్రస్తుతం పలు మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ మూవీ ని గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కస్టడీ మూవీ కోసం యూనిట్ మొత్తం ఎంతో కష్టపడ్డారని తెలుగు, తమిళ భాషల్లో మే 12న విడుదల కానున్న తమ మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందనే ఆశాభవాన్ని వ్యక్తం చేసారు హీరో నాగచైతన్య.

సంబంధిత సమాచారం :