ఇంతకు ముందెన్నడూ చేయని పనిని ట్రై చేస్తున్న నాగ చైతన్య !

ఇంతకు ముందెన్నడూ చేయని పనిని ట్రై చేస్తున్న నాగ చైతన్య !

Published on Jun 29, 2018 4:00 PM IST

Naga Chaithanya
అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇకపోతే ఈ సినిమా కోసం చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పనిని చేస్తున్నారు. అదేమిటంటే ఈ సినిమాలో ఆయన షర్ట్ లేకుండా కనిపించనున్నాడు.

సీన్ డిమాండ్ చేయడం వలన, సహజంగానే షర్ట్ లేకుండా కనిపించడానికి ఆస్కారం ఉండటం వలన ఈ అక్కినేని హీరో మొండేటి అడగ్గానే వెంటనే ఒప్పుకున్నారట. దీని వలన సినిమాకు మంచి మాస్ అప్పీల్ వస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.

మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ కథానాయకిగా కనిపించనుండగా తమన్నా ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు