చైతూ తదుపరి సినిమాకి నిర్మాత అతనేనా?

చైతూ తదుపరి సినిమాకి నిర్మాత అతనేనా?

Published on Apr 9, 2015 4:00 PM IST

radha-krishna
కార్తికేయ సినిమాతో తెలుగు సినిమా రంగానికి పరిచయమైన చందూ మొందేటి తన తదుపరి చిత్రానికి నాగ చైతన్య ని ఒప్పించాడు. ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నట్టు రాధాకృష్ణ వెల్లడించారు. ఈయన హారికా మరియు హాసినీ బ్యానర్ పై త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల సన్నాఫ్ సత్యమూర్తి సినిమాను నిర్మించారు.

అయితే ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జూన్ మధ్యనుండి ఈ సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం నాగ చైతన్య ‘దోచెయ్’ సినిమాని పూర్తిచేసే పనిలో వున్నాడు. కృతి సనన్ హీరోయిన్. సుదీర్ వర్మ దర్శకుడు

తాజా వార్తలు