ఇండస్ట్రీలో సినిమా సినిమాకి అస్సలు గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరోస్ లో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఒకరు. నాగ చైతన్య ప్రస్తుతం ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. గత నెల రోజులుగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. అక్కడ నాగ చైతన్య – కృతి సనన్ మీద వచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు.
‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర టీం ప్రస్తుతం ఈ సినిమాకి ‘మాయగాడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇది కాకుండా నాగ చైతన్య నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’ అక్టోబర్ 17న విడుదలకు సిద్దంగా ఉంది. ‘ఒక లైలా కోసం’ సినిమా విజయం పై నాగ చైతన్య మరియు నిర్మాత అయిన నాగార్జున ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.


