గుట్టు చప్పుడు కాకుండా పని చేస్తున్న నాగ చైతన్య !


వరుసగా రెండు హిట్లు ఖాతాలో వేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ కాగా, మరొకటి కృష్ణ మరియముత్తు చిత్రం. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న సినిమా తాలూకు వివరాలు ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా బయటికొస్తున్నా మరియముత్తు ప్రాజెక్ట్ సంగతులు మాత్రం తెలీడంలేదు. తాజాగా ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ షూటింగుకు సంబందించిన కొన్ని వివరాల్ని తెలిపాడు.

ఆ వివరాల ప్రకారం సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిందని తెలుస్తోంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం థ్రిల్లర్ జానర్లో ఉండనుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తుండగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.