ఆ డైరెక్టర్ తో నాగ చైతన్య కన్ఫర్మే !

ఆ డైరెక్టర్ తో నాగ చైతన్య కన్ఫర్మే !

Published on Mar 12, 2019 8:09 AM IST

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫెయిల్ అయిన ఒక క్రికెటర్ జీవితంలోకి.. భర్తే ప్రాణం అని నమ్మే ఒక అమ్మాయి భార్యగా వస్తే.. ఆ తరువాత అతని లైఫ్ ఎలా మారుతుంది, తిరిగి అతను జీవితంలో ఎలా ఎదిగాడు అనే పాయింట్ బేస్ చేసుకుని శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తోన్నాడు.

అలాగే చైతు ప్రస్తుతం ‘వెంకీ మామ’ షూట్ లో పాల్గొంటున్నాడు. కాగా చైతు మరో టాప్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో చైతు సినిమా చేయబోతున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా మొదలు కానుందని సమాచారం.

చైతు కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నారు. పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా అంతటి గొప్ప విషాదాంతమైన ప్రేమ కథను చైతు కోసం రాశాడట విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుక పడిన చైతూకి శివ నిర్వాణ అన్నా ‘మజిలీ’తో మంచి హిట్ ఇస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు