నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంలో ప్రముఖ నటులు నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి . దాంట్లో భాగంగా అక్కినేని నాగేశ్వర్ రావు గారి పాత్రలో ఆయన మనవడు నాగ చైతన్య నటించనున్నాడని ఒక వార్త హల్చల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ పాత్రను చైతు తో కాకుండా అక్కినేని ఫ్యామిలీ లోనే మరొకరి చేత చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు.
ఇంతకుముందు చైతు సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో ఏఎన్ఆర్ పాత్రలో నటించారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాకోసం చైతు ని కాకుండా వేరే వారిని తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే గత కొద్దీ రోజులుగా ఈ చిత్రం ఫై వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు.


