ఫుల్ స్వింగ్ లో “దూత” ప్రమోషన్స్..!

ఫుల్ స్వింగ్ లో “దూత” ప్రమోషన్స్..!

Published on Nov 28, 2023 2:00 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఇప్పుడు తన కెరీర్ లోనే భారీ చిత్రం “తండేల్” ని రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఈ గుడ్ న్యూస్ అనంతరం మరో బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ తన అవైటెడ్ వెబ్ సిరీస్ “దూత” పై కూడా క్లారిటీ వచ్చింది. మరి దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ సిరీస్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కూడా రావడం మంచి రెస్పాన్స్ అందుకోవడంతో మేకర్స్ ఈ సిరీస్ ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగానే ఇప్పుడు సాలిడ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసారు. చై మొదటి వెబ్ సిరీస్ ఇదే కావడంతో మరింత స్పెషల్ గా ఈ సిరీస్ ని తీసుకోగా ఇప్పుడు వరుస ప్రమోషన్స్ ని రిలీజ్ డేట్ నాటికి చేయనున్నారు. ఇక ఈ సిరీస్ అయితే పాన్ ఇండియా భాషల్లో డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ సిరీస్ లో ఫీమేల్ లీడ్ గా ప్రియా భవాని శంకర్ నటించగా శరత్ మరార్ ఈ సిరీస్ ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు