హైబ్రిడ్ పిల్లతో మళ్ళీ శేఖర్ కమ్ముల…!

Published on Jun 17, 2019 8:57 pm IST

2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ హిట్ సాయి పల్లవి తెలుగులో తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. స్వతంత్ర్య భావాలు కలిగిన , ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిగా సాయి పల్లవి నటన తెలుగు ప్రేక్షకులకు తెగనచ్చేసింది. ముఖ్యంగా “వచ్చిండే” సాంగ్ తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫేమస్ ఐయిందో చెప్పలేం. ఇక యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో సంచలం రేపింది. ఈ ‘ఫిదా’ కాంబినేషన్ త్వరలో మళ్ళీ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారట. .

ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి ‘వెంకీ మామ’ సెట్స్ మీద ఉండగా.. మరొకటి ‘బంగార్రాజు’ కాగా.. మేర్లపాక గాంధీ చిత్రం.. దిల్ రాజు బ్యానర్‌లో మరో సినిమా కూడా లైన్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాల మధ్యలో శేఖర్ కమ్ముల చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి మరి. శేఖర్ కమ్ముల లాంటి ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ తో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ అనేసరికి ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

సంబంధిత సమాచారం :

X
More