నాగ్ తో మరోసారి కలిసి నటించనున్న నాగ చైతన్య !

Published on Apr 3, 2019 9:00 pm IST

కింగ్ నాగార్జున , కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ నాగ్ కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈచిత్రానికి అదే కాంబినేషన్ లో సీక్వెల్ తెరకెక్కనుంది. ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈచిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు కళ్యాణ్ కృష్ణ.

ఇక ఈ చిత్రంలో నాగ్ తో పాటు నాగ చైతన్య కూడా నటించనున్నాడు. ఈ విషయాన్ని తాజా గా జరిగిన ఇంటర్వ్యూ లో స్వయంగా చైతూ నే ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సీక్వెల్ ఫై నాన్నా చాలా ఆసక్తిగా వున్నాడు. అన్ని కుదిరితే ఆగస్టు నుండి ఈ చిత్రం స్టార్ట్ కానుందని చైతూ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక గతంలో నాగ్ , చైతూ కలిసి మనం లో నటించారు. ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :