చైతు స్టన్నింగ్ మేకోవర్ ఏ సినిమా కోసమో.?

Published on Jun 24, 2021 9:00 pm IST

అక్కినేని యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఎలాంటి నటుడో మన అందరికీ తెలుసు. తన యంగ్ ఏజ్ లోనే ఎంతో పరిపక్వత గల నటనను చైతు అందించాడు. అలాగే ఒక్క నటనతోనే కాకుండా ఓ సినిమా కోసం మంచి మేకోవర్స్ లోకి కూడా మారుతుంటాడు. అలా ఇప్పటి వరకు భిన్నమైన షేడ్స్ ని చూపించిన చైతు ఈసారి బీస్ట్ మోడ్ ఆన్ చేసాడు. తన జిమ్ లో గట్టిగా కసరత్తులు చేస్తూ బిజీ అయ్యాడు.

అయితే నాగ చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మ్యాచో బాడీని రెడీ చేస్తున్నాడట. అందుకోసమే అంత కష్టపడుతున్నాడని తెలుస్తుంది. మరి చైతు ఇంతలా చేస్తుంది ఏ సినిమా కోసమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే తాను నటించిన “లవ్ స్టోరీ” కంప్లీట్ అయ్యి మరో చిత్రం “థ్యాంక్ యూ” సినిమా కూడా ముగింపులో ఉంది. అలాగే ఓ బాలీవుడ్ సినిమా కూడా చేస్తున్నాడని మరి తెలిసింది. మరి దాని కోసమా లేక పూర్తిగా మరో కొత్త సినిమా కోసమా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :