మహేష్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్కివ్వనున్న చైతు..?

Published on Jan 7, 2021 5:00 pm IST

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య ఇప్పుడు తనదైన రోల్స్ చేస్తూ మంచి లైనప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. “మజిలీ” సూపర్ హిట్ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రం “లవ్ స్టోరీ”లో మరింత పరిపక్వత చెందిన నటుడిగా కనిపిస్తున్నాడు.

అలాగే ఎలాంటి ఏజ్ గ్రూప్ రోల్స్ కు అయినా సెట్టవ్వగలిగే ఈ టాలెంటెడ్ నటుడు ఆ చిత్రం అనంతరం టాలెంటెడ్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో “థ్యాంక్ యూ” అనే మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ను చేపట్టాడు. అయితే మరి ఈ సినిమాలో చైతు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు సూపర్ కిక్కివ్వనున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఎందుకంటే ఈ చిత్రంలో చైతు పక్కా మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్ గా కనిపిస్తాడట అంతే కాకుండా మహేష్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అసోసేషియన్ ప్రెసిడెంట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. అంతే కాకుండా చైతు ఈ చిత్రంలో ఒక హాకీ ప్లేయర్ గా కూడా కనిపిస్తాడని టాక్ కూడా ఉంది. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :