NC22: ఇంటెన్స్ ప్రీ లుక్ తో అదరగొట్టిన నాగ చైతన్య!

NC22: ఇంటెన్స్ ప్రీ లుక్ తో అదరగొట్టిన నాగ చైతన్య!

Published on Nov 22, 2022 11:47 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య తన అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు ద్విభాషా చిత్రంతో రాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ ఈరోజు విడుదలైంది. మేకర్స్ సినిమా యొక్క ఇంటెన్స్ ప్రీ లుక్‌ను విడుదల చేసారు. ఈ చిత్రం NC 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.

అయితే రిలీజైన ప్రీ లుక్ అద్దిరిపోయింది. పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్‌ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంకి ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా లు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు