చైతు-సాయి పల్లవి మూవీ పై క్లారిటీ వచ్చేసిందిగా…!

Published on Jun 20, 2019 3:21 pm IST

గత కొన్నిరోజులుగా హీరో నాగ చైతన్య, క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా ఓ మూవీ రాబోతుందంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే ఈ ఊహాగానాలకు తెరదించుతూ నేడు వీరిద్దరూ సినిమా పై స్పష్టత ఇచ్చేసారు. ఈ సంధర్బంగా కలిసి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. హీరోయిన్ గా కూడా సాయి పల్లవినే ఎంపిక చేశారు.

ఆగస్టు మొదటివారం లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య వెంటేష్ తో కలిసి బాబీ డైరెక్షన్ లో “వెంకీ మామ” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి,శేఖర్ కాంబినేషన్ అనేసరికి మరోసారి ‘ఫిదా’ మ్యాజిక్ రిపీట్ కానుందని అందరూ భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More