నాగ చైతన్య డెబ్యూ ప్రాజెక్ట్ ఇంకాస్త ఆలస్యం

Published on Jun 9, 2021 1:06 am IST

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ స్నేహితుడి పాత్ర కోసం మొదట తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ సేతుపతికి డేట్స్ కుదరకపోవడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ పాత్రను నాగ చైతన్య చేయనున్నాడు. చైతన్యకు ఇదే బాలీవుడ్లోకి డెబ్యూ సినిమా. లాక్ డౌన్ మూలంగా సినిమా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే వీలైనంత త్వరగా చిత్రీకరణను రీస్టార్ట్ చేయాలని అనుకున్నారు ఆమిర్ ఖాన్.

జూలై మొదటి వారం నుండి మొదలుపెట్టాలని అనుకున్నారు. ముందుగా ఒక వార్ సీన్ షూటింగ్ ప్లాన్ చేశారు. ఇందులోనే నాగ చైతన్య జాయిన్ కావాల్సి ఉంది. వార్ ఎపిసోడ్ మొత్తం చైతన్య ఆమిర్ ఖాన్ పక్కనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ ప్లాన్స్ మారినట్టు తెలుస్తోంది. ఇంకా కరోనా పూర్తిగా అదుపులోకి రాలేదు కాబట్టి
వందల మంది బృందాన్ని చిత్రీకరణకు దింపి వారి ఆరోగ్యాలను రిస్క్ చేయడం ఎందుకని భావించిన ఆమిర్ ఖాన్ ఇంకొన్ని రోజులు ఎదురుచూడాలని డెసిషన్ తీసుకున్నారట. దీంతో మరోసారి షూట్ వాయిదాపడినట్టే. షూటింగ్ మొదలయ్యే కొత్త డేట్ కూడ ఇంకా బయటకి రాలేదు. ఇకపోతే నాగ చైతన్య చేసిన ‘లవ్ స్టోరీ’ విడుదలకు రెడీగా ఉండగా ‘థాంక్యూ’ చిత్రం కూడ ఆఖరి దశ పనుల్లో ఉంది.

సంబంధిత సమాచారం :