ఆకట్టుకుంటున్న నాగ చైతన్య “థాంక్యూ” ఫస్ట్ లుక్!

Published on Nov 23, 2021 5:00 pm IST

అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం థాంక్యూ. ఈ చిత్రం ను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ టాలివుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

అక్కినేని నాగ చైతన్య ఈ చిత్రం లో ఎలా ఉండబోతున్నారు అనేది ఈ ఫస్ట్ లుక్ ను చూస్తే తెలుస్తుంది. గెడ్డం తో, కళ్ళజోడు పెట్టుకొని క్లాస్ లుక్ లో కనిపిస్తున్నారు చైతన్య. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా, అవికా గోర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :