దిల్ రాజు నిర్మాణంలో నాగ చైతన్య !

దిల్ రాజు నిర్మాణంలో నాగ చైతన్య !

Published on Jan 31, 2019 2:53 PM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం చైతన్య , శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత చైతు , వెంకటేష్ తో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నాడు. ఫిబ్రవరి 21నుండి ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఇక ఇప్పుడు నాగ చైతన్య మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో చైతన్య నటించనున్నాడు. ఆల్రెడీ స్టోరీ నరేషన్ పూర్తి అయ్యి క్యాస్ట్ ను కూడా ఫైనల్ చేశారు. నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా నాగ చైతన్య ఇంతకుముందు ఇదే నిర్మాణ సంస్థలో ‘జోష్’ అనే చిత్రం చేశాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత మరో చిత్రం చేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు