పోలీస్ ఆఫీసర్ గా చైతూ ?

Published on Apr 26, 2019 8:18 am IST

మజిలీ తో ఎట్టకేలకు చాలా రోజుల తరువాత సాలిడ్ హిట్ కొట్టాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో కలిసి వెంకీ మామ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత సోలో హీరోగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి మహాసముద్రం అనే టైటిల్ ప్రచారం లో వుంది. ఇక ఈ చిత్రంలో చైతూ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడని టాక్. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే తన కెరీర్ లో చైతూ ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడు అజయ్ భూపతి. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :