ఇంటర్వ్యూ : నాగ చైతన్య – మజిలీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా !

Published on Apr 3, 2019 1:07 pm IST

సవ్యసాచి తరవాత యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన తాజా చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 5న విడుదలకానుంది. ఈ సందర్బంగా చైతూ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది ?

నిన్ను కోరి చూశాను. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా డైరెక్టర్ శివ క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం బాగా నచ్చింది. ఫోన్ చేసి ఇలాంటి టైప్ స్టోరీ ఏమైనా వుంటూ చెప్పు అన్నాను. రెండు నెలల తరువాత మజిలీ స్టోరీ తో నా దగ్గరకు వచ్చాడు. 20 నిమిషాలు కథ చెప్పాడు వెంటనే ఓకే చెప్పాను.

ఈసినిమా కు సమంత ను తీసుకోమని మీరే చెప్పారా ?

లేదు నేను తనను అడగలేదు. శ్రావణి పాత్ర కు సమంత అయితే బాగుంటుందని శివ అన్నాడు. నాక్కూడా పెళ్లి తరువాత సామ్ నేను కలిసి నటించడానికి మంచి స్టోరీ దొరికిందనిపించింది.

సమంత ఏమైనా డామినేట్ చేసిందా ?

చేసింది (నవ్వుతూ). నిజంగా తను ఈ సినిమాలో నటిచడం వల్ల నాకు బాగా హెల్ఫ్ అయ్యింది. మా ఇద్దరి పాత్రలు కూడా చాలా ఇంటెన్సివ్ గా ఉంటాయి. తన పాత్ర కంటే నా పాత్ర గురించి కూడా చాలా టెన్షన్ పడింది.

సినిమా స్టోరీ గురించి ?

మిడికల్ క్లాస్ ఫ్యామిలీసెంటిమెంట్స్ , వారి జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ చిత్రం. సినిమా చాలా సహజంగా , రియలిస్టిక్ గా ఉంటుంది. సినిమాలో సామ్ తప్ప నన్ను ఎవరు ఇష్టపడరు.

నాగార్జున సినిమా చూశారా ? ఏమైనా మార్పులు చేయమన్నారా ?

ఇంకా ఆయన సినిమా చూడలేదు. ముందే చూప్పిద్దాం అనుకున్నాం కానీ రీ రికార్డింగ్ అప్పటికి పూర్తి కాలేదు. లవ్ స్టోరీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా చూస్తే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు.

నిర్మాతల గురించి ?

హరీష్ , సాహు తో కలిసి చేయడం చాలా హ్యాపీ అనిపించింది. స్క్రిప్ట్ స్టేజ్ లో ఇలాంటి సినిమా ను ఓకే చేసి జడ్జ్ చేయడం గొప్ప విషయం. నాకు ,సామ్ కు ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ ఇది. అయితే నాన్న గారు కూడా అడిగారు మన స్టూడియో లో చేయకుండా బయటివాళ్లతో ఎందుకని కానీ వారి తో చేస్తే హోం ప్రొడక్షన్ లో చేసినట్టుఅనిపించింది. అంత ఫ్రీడమ్ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :