ఇదంతా తాత కోసమే అంటున్న నాగ చైతు

ఇదంతా తాత కోసమే అంటున్న నాగ చైతు

Published on Jun 6, 2019 8:27 AM IST

నేడు మూవీ మొఘల్ రామానాయడు జయంతి సంధర్బంగా తన తాత “వెంకీ మామ” మూవీని అంకితమిస్తున్నట్లుగా చైతు, నిర్మాత సురేష్ బాబు ఓ బావోద్వేగ ట్వీట్ చేశారు. “ఇదంతా మీకోసమే తాతయ్య” అని సందేశం రాసి “వెంకీ మామ” సినిమా పోస్టర్ ని పోస్ట్ చేశారు చైతన్య. ఆ పోస్టర్ పై “మనువడు, కొడుకు ఒకే మూవీలో సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్నది మీ కల, అది నిజమైయ్యే నాటికి మీరు మాకు దూరంగా వెళ్లిపోయారు” అని అర్థం వచ్చేలా సురేష్ బాబు సందేశం ఆ పోస్టర్ పై ఉంది. వెంకటేష్ , చైతు కలిసి నటిస్తే చూడాలన్న రామానాయుడి కల తీరకుండానే ఆయన మరణించినందుకు కుటుంబ సభ్యులు చాలా బాధపటుతున్నట్లున్నారు.

ఎక్కడో మారుమూల గ్రామమైన కారంచేడు లో 1936 జూన్ 6న జన్మించిన దగ్గుబాటి రామానాయుడు సినిమా నిర్మాణం పై మక్కువతో మద్రాస్ వెళ్లి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని అజరామరమైన సినిమాలు నిర్మించి మూవీ మొఘల్ గా ఎదిగారు. ఆయన స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవలే 55 వసంతాలు పూర్తి చేసుకుంది. దాదాపు అన్ని భారతీయ భాషలలో ఈ సంస్థ సినిమాలు నిర్మించింది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2009 ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డుతో సత్కరించింది. ప్రోస్టేజ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 18, 2015 లో కన్నుమూశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు