ఐరా బ్యానర్ లో నాగశౌర్య సినిమా నుంచి స్వచ్ఛమైన టైటిల్ అండ్ లుక్!

ఐరా బ్యానర్ లో నాగశౌర్య సినిమా నుంచి స్వచ్ఛమైన టైటిల్ అండ్ లుక్!

Published on Jan 22, 2022 11:45 AM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఎప్పటికప్పుడు కొత్తదనంతో అలరించాలని కోరుకునే వారు తక్కువ మందే ఉన్నారు. అయితే ఈ తక్కువ మందిలో హిట్స్ పడినా ప్లాప్స్ పడినా కొత్తరకం సినిమాలను అందించడంలో మాత్రం యంగ్ హీరో నాగ శౌర్య ముందు ఉంటాడు. మరి అలాంటి శౌర్య బర్త్ డే ఈరోజు కావడంతో సినీ వర్గాల్లో ప్రముఖులు అతడికి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.

మరి అలాగే ఈరోజు తన లైనప్ లో సినిమాలపై కూడా కీలక అప్డేట్స్ వస్తుండగా వాటిలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మేకర్స్ రివీల్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నాగ శౌర్య హీరోగా కొన్నాళ్ల కితం సినిమాని స్టార్ట్ చేయగా దానికి “కృష్ణ వ్రింద విహారి” అనే ఒక స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు టైటిల్ ని పెట్టారు.

అలాగే ఇందులో నాగ శౌర్య లుక్ కూడా మంచి ప్లెజెంట్ గా సింపుల్ గా కనిపిస్తుంది. అంతే కాకుండా కాస్త బుద్ధిమంతుడులా కనిపిస్తూ హ్యాండ్సమ్ లుక్ లో నాగ శౌర్య ఉన్నాడు. ఇక ఈ సినిమాకి అనీష్ కృష్ణ అనే కొత్త దర్శకుడు వర్క్ చేస్తుండగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నటి షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తానికి అయితే ఈ ఫస్ట్ లుక్ మంచి ప్రామిసింగ్ గా అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు