మెగాస్టార్ ఆశీస్సులు తీసుకున్న నాగశౌర్య

Published on Jan 30, 2020 2:06 am IST

యంగ్ హీరో నాగశౌర్య చేస్తున్న సినిమాల్లో ‘అశ్వద్దామ’ కూడా ఒకటి. రమణ తేజ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 31న విడుదలకానుంది. ఈ సంధర్భంగా నాగశౌర్య అతని తల్లితో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సంధర్భంగా నాగశౌర్య సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ‘మిమ్మల్నమిమ్మల్ని చూసిన ప్రతిసారి గొప్పగా అనిపిస్తుంటుంది. ప్రతి అడుగులో మీ ఆశీస్సులు పొందడం నాకు, నా ఐరా క్రియేషన్స్ సంస్థకు గర్వంగా ఉంది. మీరు నిజమైన మెగాస్టార్. వియ్ లవ్ యు ఫరెవర్’ అంటూ పోస్ట్ పెట్టారు. గతంలో నాగశౌర్య చేసిన ‘ఛలో’ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ హాజరవడం, ఆ చిత్రం పెద్ద విజయాన్ని సాధించడం తెలిసిన సంగతే.

సంబంధిత సమాచారం :

X
More