నవంబర్ 12 న విడుదల కానున్న నాగ శౌర్య “లక్ష్య”

నవంబర్ 12 న విడుదల కానున్న నాగ శౌర్య “లక్ష్య”

Published on Sep 27, 2021 6:00 PM IST

యువ హీరో నాగ శౌర్య నటిస్తున్న 20 వ చిత్రం లక్ష్య. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమా విడుదల తేదీ పై నిన్న చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదల తేదీ ను గెస్ చేయండి అంటూ కొన్ని తేదీలను ప్రకటించడం జరిగింది. అయితే నవంబర్ 12 వ తేదీన విడుదల చేస్తున్నట్లు నేడు సరికొత్త పోస్టర్ తో ప్రకటించడం జరిగింది. నాగ శౌర్య ఈ చిత్రం కోసం పూర్తిగా మారిపోయారు. పోస్టర్ లో నాగ శౌర్య సరికొత్త అవతార్ లో కనిపిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో జగపతి బాబు మరియు సచిన్ ఖేడేకర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు