వావ్ అనిపిస్తున్న నాగ శౌర్య లుక్ !

Published on Nov 30, 2020 8:07 pm IST

యంగ్ హీరో నాగ శౌర్య వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన స్టార్ట్ చేసిన సినిమాలు మూడు వరకు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో ఒక స్పోర్ట్స్ డ్రామా కూడ ఉంది. అది ఆర్చరీ నేపథ్యంలో ఉండనుంది. ఈ సినిమాకు సంభందించిన టైటిల్ పోస్టర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. సినిమాకు ‘లక్ష్య’ అనే టైటిల్ నిర్ణయించారు. సినిమా కోసం నాగ శౌర్య ప్రత్యేకంగా బాడీ బిల్డ్ చేశారు. అందరు హీరోలు సిక్స్ ప్యాక్ ట్రై చేస్తుంటే నాగ శౌర్య మాత్రం ఏకంగా ఎయిట్ ప్యాక్ సిద్దం చేసుకున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆయన లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. శౌర్య చూపించిన ఈ గొప్ప మార్పును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. లుక్ చూశాక సినిమా మీద నమ్మకం కూడ పెరిగింది. పైగా ఆర్చరీ క్రీడ మీద రూపొందుతున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్, శ్రీవేంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. కాల భైరవ ఈ సినిమాకు సంగీతం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More