వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుంటాయట !

Published on May 3, 2021 1:01 pm IST

హీరో నాగ శౌర్య, హీరోయిన్ రితు వర్మ రానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరుడు కావలేను’. కాగా ఇప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ఈ సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందని.. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాల బాగున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తల మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయట. అలాగే ఈ చిత్ర కథతో పాటు కథనంలోని భావోద్వేగాలు వాటికీ అనుగుణంగా నటీ నటుల అభినయాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయట. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేయనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత అందిస్తుండగా వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పి.డి.వి.ప్రసాద్ సమర్పిస్తున్నారు. కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి.

సంబంధిత సమాచారం :