ఎన్టీఆర్ కి మూడో స్థానం, నాగశౌర్యకి ఐదవ స్థానం !

Published on Jun 2, 2021 1:46 pm IST

హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన 2020 పాప్యులర్ మేల్స్ లో టాలీవుడ్ టాప్ హీరోస్ ను హైదరాబాద్ టైమ్స్ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో మూడో స్థానంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ రాగా, ఐదవ స్థానాన్ని నాగశౌర్య దక్కించుకున్నాడు. ఎన్టీఆర్ 2019వ సంవత్సరపు జాబితాలో 19వ స్థానంలో ఉండగా.. తాజా జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఇక ఈ ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ టైమ్స్ జాబితాలో నాగశౌర్య కూడా ఐదో స్థానం దక్కించుకోవడంతో నెటిజన్లు శౌర్యను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ‘లక్ష్య’ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ కూడా పెంచాడు శౌర్య. అవసరాల శ్రీనివాస్ సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా వర్క్ కూడా యాభై శాతం పూర్తి కాగా మిగిలిన భాగం అమెరికాలో చేయవలసి ఉంది. కోవిడ్ సెకెండ్ వేవ్ తగ్గినా వెంటనే మళ్ళీ ఈ సినిమా షూట్ మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :