తన తర్వాత సినిమా పై ఫోకస్ పెట్టిన యంగ్ హీరో !
Published on Sep 10, 2018 6:21 pm IST

ఛలో సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న నాగశౌర్యకు ‘అమ్మమ్మగారిల్లు’ మరియు ‘@నర్తనశాల’ చిత్రాలు బ్రేక్ వేశాయి. సక్సెస్ ఫుల్ హీరోగా కంటిన్యూ అవుదామనుకున్న శౌర్య ఆశలు మీద నీళ్లు చల్లాయి ఆ చిత్రాలు. దీనికి తోడు ‘@నర్తనశాల’ చిత్రం నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ కి నష్టాలను కూడా తెచ్చి పెట్టింది. అందుకేనేమో ఇప్పుడు నాగశౌర్య తన తర్వాత చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ సారి చేయబోయే సినిమాతో ఎలాగైనా మళ్లీ భారీ సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు.

కాగా ప్రస్తుతం నాగ‌శౌర్య‌, కొత్త దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వంలో ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం చాలా బాగా వస్తుందని తెలుస్తోంది. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యానర్ పై వి.ఆనంద ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook